kalyan ram: కల్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీలో ఎన్టీఆర్?

  • రెండు సినిమాలతో బిజీగా కల్యాణ్ రామ్ 
  • తదుపరి సినిమా పవన్ సాధినేనితో 
  • ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యం

ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే' .. 'నా నువ్వే' సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే. ఒక సినిమాలో కాజల్ హీరోయిన్ అయితే .. మరో సినిమాలో తమన్నా హీరోయిన్. ఈ రెండు సినిమాలపై కల్యాణ్ రామ్ బలమైన నమ్మకంతో వున్నాడు. ఇక తన తదుపరి సినిమాను ఆయన పవన్ సాధినేనితో చేయడానికి రెడీ అవుతున్నాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో .. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. కథా పరంగా .. నిడివి తక్కువగా గల రెండు ముఖ్యమైన పాత్రలు అవసరం కావడంతో, హరికృష్ణ .. ఎన్టీఆర్ లతో ఆ పాత్రలను చేయించాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఆ ఇద్దరూ చేస్తే సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే కథానాయికలు ఎవరనేది ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోన్న ఈ ప్రచారంలో నిజమెంతనేది చూడాలి మరి.              

  • Loading...

More Telugu News