Tamilnadu: గేమ్ షో: నటుడు ఆర్యను పెళ్లాడేందుకు అమ్మాయిల క్యూ.. 70 వేల దరఖాస్తులు!

  • ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ షో కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • వెల్లువెత్తిన దరఖాస్తులు
  • వడపోసి 18 మందిని ఫైనల్ చేసిన టీవీ చానల్

తమిళ నటుడు ఆర్యను పెళ్లాడేందుకు యువతులు క్యూకట్టారు. ఏకంగా 70 మంది అమ్మాయిలు పెళ్లాడతామంటూ ముందుకొచ్చారు. ఆర్య ఇటీవల వధువు కావాలంటూ ఇంటర్నెట్‌లో ప్రకటించాడు. ఈ ప్రకటనకు అనూహ్య స్పందన లభించింది. మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 6 వేల మంది ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తనకొచ్చిన వేలాది దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి 18 మందిని ఫైనల్ చేశారు.

వయాకామ్ 18 అనే సంస్థ ఇటీవల కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చానల్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఏప్రిల్‌లో ‘ఇంగవీట్లు మాపిళ్ళై' అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. ఈ షోలో నటుడు ఆర్య పెళ్లికొడుకుగా పాల్గొనేందుకు సమ్మతించాడని పేర్కొన్నారు. కాగా, ఈ షోలో భాగంగానే అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లోంచి 18 మందిని ఎంపిక చేసి పైనల్ చేశారు.

  • Loading...

More Telugu News