vishal: తలనొప్పితో బాధపడుతూ ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన నటుడు విశాల్!

  • 'ఇరుంబుతిరై' సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ విశాల్
  • తాజాగా 'సండైకోళి 2' షూటింగ్ పూర్తి
  • తలనొప్పితో ఆసుపత్రిలో చేరిన విశాల్

ప్రముఖ నటుడు, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. 'ఇరుంబుతిరై' సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడ్డాడు. అప్పుడే ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. అయితే తాత్కాలిక వైద్యం చేయించుకుని అప్పట్లో షూటింగ్ లో పాల్గొన్నాడు. తాజాగా 'సండైకోళి 2' సినిమా షూటింగ్ ముగియడంతో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న విశాల్ ఫిజియో థెరపీ కోసం ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడని సమాచారం. 

vishal
kollywood
actor
  • Loading...

More Telugu News