casting couch: కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏక్తా కపూర్

  • సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియాలో పెను దుమారం
  • నిర్మాత, నటులపై లైంగిక ఆరోపణలు చేసిన నటీమణులు
  • కాస్టింగ్ కౌచ్ అంశంలో నిర్మాతలను వెనకేసుకొచ్చిన ఏక్తా కపూర్

చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా భాష ఏదైనా చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమన్న స్థాయిలో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలో పలువురు నిర్మాతలు, నటులపై తీవ్రమైన ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ అంశంలో నిర్మాతలనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారని ప్రశ్నించింది.

చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమంతట తామే నిర్మాతల దగ్గరకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్, పొజిషన్‌ లో ఉన్నారు కదా అని నిర్మాతలను నిందించడం సరికాదని ఏక్తా హితవు పలికింది. ఉదాహరణకు ఒక హీరోయిన్ అర్ధరాత్రి నిర్మాతను కలిసి, తరువాతి రోజు తనకు సినిమాలో అవకాశం ఇవ్వమంటే తప్పెవరిది? అని ప్రశ్నించింది. ఆ సినిమాలో ఆమెకు సెట్ అయ్యే పాత్ర లేనప్పుడు దోషిగా ఎవరిని నిలబెట్టాలి? అని నిలదీసింది. దీంతో బాలీవుడ్ నటీమణులు ఏక్తాపై ఫైర్ అవుతున్నారు. 

casting couch
producers
film industry
Bollywood
ekta kapoor
  • Loading...

More Telugu News