suicide: పురుగుల మందుతాగి యువతి, యువకుడి ఆత్మహత్య

  • నల్గొండ జిల్లా అడవిదేవుల పల్లిలో చెట్ల పొదల్లో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు 
  • మృతులు గుంటూరు జిల్లా గురజాల మండల వాసులుగా గుర్తింపు
  • ఘటనా స్థలంలో యువకుడి డ్రైవింగ్ లైసెన్సు లభ్యం

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో చెట్ల పొదల్లో ఇద్దరి మృతదేహాలు పడి ఉండడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి, యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు.

మృతులు గుంటూరు జిల్లా గురజాల మండల వాసులైన అయిన కోరె అప్పారావు, మువ్వ కాసులు అని తెలుసుకున్నారు. చెట్ల పొదల వద్ద అప్పారావు డ్రైవింగ్ లైసెన్సు కూడా లభ్యమైంది. మరోవైపు సదరు యువతి, యువకుడు జనవరి 1 నుంచి కనిపించట్లేదని గురజాల పీఎస్‌లో ఇప్పటికే వారి బంధువుల నుంచి ఫిర్యాదు అందించింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.   

suicide
lovers
Nalgonda District
  • Loading...

More Telugu News