Telugudesam: టీడీపీకి గుడ్‌ బై చెప్పేద్దాం.. మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారు: ఏపీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు

  • టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దాం
  • ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుదాం
  • రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తాం
  • టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఒకరు తమతో పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇప్పటికే చెప్పానని మాణిక్యాలరావు అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు. మంత్రి పదవులకి రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.    

Telugudesam
manikyala rao
Union Budget 2018-19
BJP
  • Loading...

More Telugu News