bsnl: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కొత్త ఆఫర్ లు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-adb0ef307d4da28bc078df7f9e24e9f9ba57090b.jpeg)
- ఆకర్షణీయ ఆఫర్ లతో వస్తున్న బీఎస్ఎన్ఎల్
- రూ.99, రూ.319 ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాల్స్
- ఈ ప్లాన్లలో ఎలాంటి డేటా లభించదు
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.99, రూ.319 పేరిట తన వినియోగదారులకు రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు రూ.99 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 26 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉండగా రూ.319 ప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే 90 రోజుల వాలిడిటీని పొందుతారు.
అలాగే ఈ రెండు ప్లాన్లలో నేషనల్ రోమింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. కాగా వీటిలో కస్టమర్లు ఎలాంటి డేటాని పొందలేరు. అయితే ఈమద్యే బీఎస్ఎన్ఎల్ 'మ్యాక్సిమమ్' ఆఫర్ పేరిట రూ. 999తో రీచార్జ్ తో ఏడాది పాటు రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చని తెలిపింది.