smiley: అప్పట్లో చాలా నాజూకుగా కనిపించిన బాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు ఇలా మారిపోయింది!

- బాలీవుడ్‌లో కల్‌యుగ్ చిత్రం (2005)తో సినీ రంగ ప్రవేశం చేసిన స్మైలీ సూరి
- అనారోగ్యానికి గురై సినిమాలకు దూరం
- బరువు పెరిగిపోయిన వైనం
బాలీవుడ్‌లో 'కల్‌యుగ్' చిత్రం (2005) ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి మంచి పేరు తెచ్చుకుంది స్మైలీ సూరీ. అప్పట్లో ఎంతో నాజూకుగా కనపడిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందుకు కారణం ఆమె అనారోగ్యానికి గురికావడమే. ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ విషయమే చర్చనీయాశంగా మారింది.


పీసీఓడీతో కూడా తాను బాధపడుతున్నానని, తాను గతంలో ఒత్తిడికి లోనై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది.
