casino rich se scratch off tickets: పది డాలర్ల వాలెంటైన్స్ డే గిఫ్ట్ 'లక్ష డాలర్లు' తెచ్చింది!

  • భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్టుగా పది డాలర్ల లాటరీ టికెట్ ఇచ్చిన భర్త
  • భర్తతో పరాచికాలాడిన భార్య.. అది నిజమైన వైనం  
  • ఆనందంతో పొంగిపోతున్న సింథియా

పది డాలర్ల వాలెంటైన్స్ డే గిఫ్ట్ లక్ష డాలర్ల అదృష్టాన్ని మోసుకొచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే...  అమెరికాలోని అయోవాకు చెందిన సింథియా హోల్మ్స్‌ కు తన భర్త పది డాలర్ల విలువైన 'కాసినో రిచ్‌ సె స్క్రాచ్‌ ఆఫ్‌ టికెట్‌'ను వాలెంటైన్స్‌ డే బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిని చూసిన సింథియా 'చాలా ఖరీదైన బహుమతి తెచ్చావులే' అంటూ భర్తతో పరాచికాలాడింది.

అయితే ఆమె తమాషాకు అన్నప్పటికీ, నిజంగానే ఆ లాటరీ ఆమెను వరించింది. ఏకంగా లక్ష డాలర్ల ప్రైజ్ మనీని తీసుకొచ్చింది. లాటరీ గెలిచినట్టు తెలుసుకున్న సింథియా ఆ బహుమతి కేవలం 100 డాలర్లుగా మొదట పొరపాటు పడింది. అయితే లాటరీ ఆఫీస్ కు వెళ్లి తనకు వచ్చింది 100 డాలర్ల బహుమతి కాదు, లక్ష డాలర్ల (సుమారు 64 లక్షల రూపాయలు) బహుమతి అని తెలుసుకుని ఆనందాశ్చర్యంలో మునిగిపోయింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని, బహుమతి డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కుంటానని తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News