Gundu Hanumanta Rao: అతి తక్కువ మంది మిత్రుల్లో 'గుండు' ఒకడంటూ బోరున విలపించిన బ్రహ్మానందం!

  • ఈ తెల్లవారుజామున మరణించిన గుండు హనుమంతరావు
  • ఆయన కుటుంబాన్ని పరామర్శించిన బ్రహ్మానందం
  • మూడు దశాబ్దాల అనుబంధాన్ని తలచుకుని కన్నీరు

తనను ఎంతో ఆప్యాయంగా 'బావా' అని పిలిచే గుండు హనుమంతరావు ఇక లేరంటే నమ్మలేకున్నానని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం బోరున విలపించారు. గుండుతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన 'అహనా పెళ్లంట' సినిమా తామిద్దరికీ ఎంతో గుర్తింపును తెచ్చిందని అన్నారు.

ఇండస్ట్రీలో తనకున్న అతి కొద్దిమంది మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని, మూడు వారాల క్రితం తన ఇంటికి వచ్చిన హనుమంతు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉందని చెప్పారు. తన ప్రదర్శనలతో లక్షలాది మందిలో నవ్వులు పూయించిన ధన్యజీవి ఆయనని, తనకు ఎదురైన కష్టాలను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడని చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపిన బ్రహ్మానందం గుండు మృతదేహం వద్ద చాలా సేపు నిశ్చేష్టుడై నిలబడిపోయారు.

Gundu Hanumanta Rao
Brahmanandam
Tollywood
  • Loading...

More Telugu News