YSRCP: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఆ పని టీడీపీ చేసినా మద్దతిస్తాం!: వైఎస్ జగన్

  • ప్రకాశం జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర
  • మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం
  • టీడీపీ మాకు మద్దతు ఇస్తుందా?
  • ఒకవేళ టీడీపీ అవిశ్వాసం పెడితే మేము మద్దతిస్తాం: జగన్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ తమకు మద్దతు ఇస్తుందా? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.

ఒకవేళ కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ వేదికగా ఏపీకి హోదా కోసం ఎంపీలు పోరాటం చేస్తారని, అప్పటికీ హోదా రాకుంటే ఏప్రిల్ 6న లోక్ సభకు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News