Andhra Pradesh: ఢిల్లీ పాలకులు గద్దె దిగి వచ్చే వరకూ మా పోరాటం ఆగదు: చలసాని శ్రీనివాస్

  • ఈ పోరాటానికి ముందుకు రానివాళ్లు ద్రోహులే
  • మాతో కలిసి రాని రాజకీయపార్టీ భూస్థాపితం కాక తప్పదు
  • విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో చలసాని

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఢిల్లీ పాలకులు గద్దె దిగి వచ్చే వరకూ పోరాటం చేస్తామని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం విజయవాడలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, ఈ పోరాటానికి ముందుకు రానివాళ్లు ద్రోహులేనని, ఏ రాజకీయ పార్టీ అయినా తమతో కలిసి రాకపోతే భూస్థాపితమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, వైసీపీ నేత మల్లాది విష్ణు, జనసేన నేత పోతిన మహేష్, కొణతాల రామకృష్ణ, హీరో శివాజీ తదితరులు పాల్గొన్నారు. 

Andhra Pradesh
chalasani srinivas
  • Loading...

More Telugu News