Canada: తాజ్ మహల్ ను సందర్శించి ముగ్ధుడైన కెనడా ప్రధాని

  • భార్య, ముగ్గురు పిల్లలతో కలసి సందర్శన
  • అహ్మదాబాద్, ముంబై, అమృత్ సర్ లోనూ పర్యటించే అవకాశం 
  • వారం రోజుల పాటు భారత పర్యటన షెడ్యూల్

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియా ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించారు. ఏడు రోజుల భారత పర్యటనకు తన కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఆయన విచ్చేశారు. ఈ రోజు ఆగ్రాలోని యుమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ ను భార్య, ముగ్గురు పిల్లలతో కలసి సందర్శించి అక్కడి అందాలకు ముగ్ధులయ్యారు.

మధురలోని చుర్మురా వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా సందర్శించనున్నారు. వారం రోజుల సుదీర్ఘ భారత పర్యటనలో భాగంగా జస్టిన్ ట్రుడియా అహ్మదాబాద్, ముంబై, అమృత్ సర్ లో పర్యటించనున్నారు. గుజరాత్ లో కెనడా ప్రధాని ఒకరు పర్యటించనుండడం ఇదే మొదటిసారి. భారత విద్యార్థులకు కెనడా ప్రముఖ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. 2017లో సుమారు 1.24 లక్షల మంది విద్య కోసం అక్కడికి వెళ్లారు.

Canada
Prime Minister
taj mahal
  • Loading...

More Telugu News