Hyderabad: వీడియోకాల్ లో బాయ్ ఫ్రెండ్ చూస్తుండగా కాలేజీ హాస్టల్ లో ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య!

  • హైదరాబాద్ లో కలకలం రేపిన ఘటన
  • దక్షిణ్ పటేల్ ను ప్రేమించిన హనీషా చౌదరి
  • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు

తన బాయ్ ఫ్రెండ్ కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్ లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హనీషా కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెది అనంతపురం. దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది.

ఏం జరిగిందో ఏమో, అతనికి చివరి కాల్ చేసి, వీడియోలో అతను చూస్తుండగానే ఉరేసుకుంది. వెంటనే అతను హాస్టల్ కు చేరుకుని, విషయం చెప్పి తలుపులను బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె ఫ్రెండ్స్ సాయంతో సిగ్మా ఆసుపత్రికి తరలిస్తుండగా, ఈలోగానే ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అనంతపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Hyderabad
Hanisha Chowdary
Police
sucide
  • Loading...

More Telugu News