Hyderabad: హైదరాబాద్ లో వింత ఘటన... వాకింగ్ చేస్తుంటే కుక్క ఢీకొట్టి వ్యక్తి మృతి!

  • జవహర్ నగర్ లో ఘటన
  • పరిగెత్తుకుంటూ వచ్చి ఢీకొన్న కుక్క
  • తలకు తీవ్ర గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్ లో ఓ వింత ఘటన జరిగింది. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిని ఓ వీధికుక్క ఢీకొనగా, అతను కిందపడి మరణించాడు. ఈ ఘటన జవహర్ నగర్ లో జరిగింది. ఇక్కడి మెయిన్ రోడ్డుపై కౌకూర్ కు చెందిన నర్సింగరావు ఉదయపు వాహ్యాళి చేస్తుండగా, ఎదురుగా పరిగెత్తుకు వచ్చిన ఓ కుక్క ఢీకొంది. దీంతో ఆయన కిందపడిపోగా, తలకు బలమైన గాయం అయింది. రక్తం ఎక్కువగా పోతుండగా, స్థానికులు గమనించి, ఆయన్ను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నర్సింగరావును కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన నేడు మరణించాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Hyderabad
Dog
Morning Walk
Police
  • Loading...

More Telugu News