Amitabh Bachchan: ఇదిగో నా ఉద్యోగ దరఖాస్తు: వైరల్ అవుతున్న అమితాబ్ పోస్టు!

  • హీరోల పక్కన హీరోయిన్లను కుదిర్చేందుకు నిర్మాతల పాట్లు
  • ఓ పత్రికలో ప్రత్యేక కథనం
  • తాను ఎంతో హైట్ అని, సమస్య ఉండదని చెప్పిన అమితాబ్

బాలీవుడ్ నటీ నటుల ఎత్తు, పొట్టిగా ఉన్న హీరోల పక్కన హీరోయిన్లను కుదిర్చేందుకు నిర్మాతలు పడే పాట్లపై ఓ పత్రికలో కథనం రాగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. తాను చాలా హైట్ అని, తనతో ఎత్తు సమస్యలు ఉండవని చెబుతూ, ఉద్యోగ దరఖాస్తును ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తన పేరు అమితాబ్ బచ్చన్ అని, పుట్టిన తేదీ 11-10-1942 అని, అలహాబాద్ లో పుట్టానని, వయసు 76 సంవత్సరాలని చెప్పారు. 49 సంవత్సరాలుగా సుమారు 200 సినిమాల్లో పని చేశానని, హిందీ, ఇంగ్లీషుతో పాటు పంజాబీ, బెంగాలీ భాషలు తెలుసునని అన్నారు. తన ఎత్తు 6.2 అడుగులని, తనతో ఎవరికీ ఎప్పుడూ ఎత్తు సమస్య రాదని అన్నారు. అమితాబ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News