Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు, నీరవ్ మోదీకి ఉన్న సంబంధం ఇది!

  • ప్రస్తుతం మన్ హటన్ ప్రాంతంలో నీరవ్ మోదీ
  • ట్రంప్, నీరవ్, ఆయన భార్య అమీ చదువుకున్నది ఒకటే స్కూల్ లో
  • నీరవ్ దుకాణం ప్రారంభోత్సవానికి ట్రంప్ కూడా

ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా, 30కి పైగా బ్యాంకుల్లో వేల కోట్లకు పైగా మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం న్యూయార్క్, మన్ హటన్ ప్రాంతంలో తలదాచుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇక, ఆయనకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య ఉన్న సంబంధం గురించిన ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి. నీరవ్ భార్య అమీ మోదీకి అమెరికా పాస్ పోర్టు ఉందన్న సంగతి తెలిసిందే.

ట్రంప్ తో పాటు అమీ, నీరవ్ అంతా అమెరికాలోని ఒకే స్కూల్ లో విద్యను అభ్యసించారు. వీరు ముగ్గురూ ఫిలడెల్ఫియాలోని 'ద వార్టన్ బిజినెస్ స్కూల్'లోనే చదివారు. అమీ, నీరవ్ తొలిసారిగా కలుసుకున్నది కూడా ఇక్కడేనట. అయితే, నీరవ్ ఫస్ట్ ఇయర్ తరువాత చదువు మానేశాడు. ఇదిలావుండగా, రెండున్నరేళ్ల క్రితం తన వ్యాపార విస్తరణలో భాగంగా, న్యూయార్క్ లో నీరవ్ మోదీ ఓ కొత్త ఆభరణాల దుకాణాన్ని ఏర్పాటు చేస్తే, అప్పట్లో స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. ఇప్పుడు అమెరికాలో తలదాచుకున్న నీరవ్ ను ఇండియాకు రప్పించే యత్నాలను అధికారులు మొదలుపెట్టగా, వాటికి ట్రంప్ సర్కారు ఏ మేరకు మద్దతిస్తుందో వేచి చూడాలి.

Donald Trump
Nirav Modi
Ami modi
New york
Manhattan
  • Loading...

More Telugu News