China: ఒక్క రోజులో కోటిన్నర వ్యూస్ తెచ్చుకున్న ఇద్దరు దొంగల ప్రయత్నం... చూడగానే పకపకా నవ్విస్తున్న వీడియో!

  • చైనాలోని షాంఘైలో ఘటన
  • అద్దాన్ని పగులగొట్టే క్రమంలో పార్ట్ నర్ ముఖంపై రాయి విసిరిన దొంగ
  • వీడియోను విడుదల చేసిన పోలీసులు

అనగనగా ఇద్దరు దొంగలు. ముఖాలకు మాస్క్ తగిలించుకుని దొంగతనానికి వెళ్లారు. గ్లాస్ డోర్ ను పగులగొట్టే క్రమంలో ఓ దొంగ పెద్ద రాయితో కొట్టాడు. అది పగల్లేదు. అంతవరకూ అంతా ఓకే... ఆ తరువాత జరిగిందే ఇప్పుడు నెట్టింట వైరల్. ఆ దొంగలు చేసిన పని అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ఒక్క రోజులో కోటిన్నర మంది చూసి నవ్వుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? మొదటి దొంగ రాయితో అద్దాన్ని కొట్టిన తరువాత, రెండో దొంగ కూడా అదే పని చేశాడు. తన చేతిలోని రాయిని బలంగా అద్దంకేసి విసిరాడు. అయితే, అది అద్దాన్ని తాకలేదు. మొదటి దొంగ ముఖాన్ని తాకింది. ఆ వెంటనే అతను అడ్డంగా పడిపోయాడు. దీంతో చేసేదేమీ లేక, కిందపడిన పార్టనర్ ను లేపి ఎత్తుకుని వెళ్లిపోవడం మినహా మరేమీ చేయలేకపోయాడు.

 చైనాలోని షాంఘైలో ప్రేమికుల రోజున జరిగిన ఘటన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఇలాంటి దొంగలున్నంత కాలం తమకు ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిన పనిలేదంటూ కామెంట్ కూడా పెట్టారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News