Madhya Pradesh: స్వయంగా మరుగుదొడ్డిలో చెయ్యిపెట్టి శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా... వీడియో!

  • మధ్యప్రదేశ్ లో రియా ఎంపీ జనార్దన్ మిశ్రా
  • పాఠశాల తనిఖీ
  • మరుగుదొడ్లు వాడటం లేదన్న విద్యార్థులు
  • స్వయంగా బాగు చేసిన ఎంపీ

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధుల్లో తాను కూడా ఒకరినని నిరూపించారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా. ఓ పాఠశాలను సందర్శించిన వేళ, అక్కడ బాగాలేని ఓ టాయిలెట్ ను స్వయంగా శుభ్రపరచగా, ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతుండగా, తామంతా బహిర్భూమి నిమిత్తం బయటకు వెళుతున్నామని చెప్పారు.

మరుగుదొడ్లు సక్రమంగా లేని కారణంగా వాటిని వినియోగించడం లేదని విద్యార్థులు చెప్పడంతో, పరిశీలించిన ఆయన, ఓ చీపురు పట్టుకుని మరుగుదొడ్లను శుభ్రపరిచారు. తన ఎడమ చేత్తో లోపల కూరుకుపోయిన చెత్తను బయటకు తీశారు. ఆయనపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News