Virat Kohli: ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్‌: ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్

  • కోహ్లీ ఆటపై సర్వత్రా ప్రశంసల జల్లు
  • దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌
  • కోహ్లీ ఆటతీరు అత్యద్భుతం: రషీద్

నిన్న ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన చివ‌రి వన్డే మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరహో అనిపించేలా ఆడి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై విదేశీ క్రికెటర్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా విరాట్‌ని కొనియాడుతూ... ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసి అలరించాడు.

'ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్' అని ఆయన పేర్కొన్నాడు. చివరకు అత్యద్భుతమని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టుల్లో ఓడినప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. అంతేకాక, వన్డేల్లో గెలిచి సౌతాఫ్రికాను వెనక్కు నెట్టి అందులోనూ టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియాకు ఘన విజయాలను అందిస్తోన్న కోహ్లీ ప్రతిభపై సర్వత్ర ప్రశంసలు దక్కుతున్నాయి. 

Virat Kohli
afganisthan
Cricket
south africa
  • Error fetching data: Network response was not ok

More Telugu News