tooly wood: నారా రోహిత్ తో జతకట్టనున్న బెంగాలీ ముద్దుగుమ్మ!

  • కొత్త చిత్రం ‘ఆటగాళ్లు’లో రోహిత్ సరసన దర్శన బానిక్
  • ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్న బెంగాలీ ముద్దుగుమ్మ
  • పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటగాళ్లు’

నారా రోహిత్ హీరోగా ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్రంలో రోహిత్ సరసన బెంగాలీ ముద్దుగుమ్మ దర్శన బానిక్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆటగాళ్లు చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, దర్శన్ బానిక్ గురించి చెప్పాలంటే..  మోడల్ గా, నటిగా కొనసాగుతోంది. పీసీ చంద్ర జువెల్లర్స్, వొడాఫోన్, బోరోలిన్/ఎలీన్, ఎఫ్బీబీ (ఫ్యూచర్ గ్రూప్), వివెల్ (ఐటీసీ) తదితర సంస్థల వ్యాపార ప్రకటనల్లో ఆమె కనబడుతుంటుంది.

tooly wood
nara rohit
  • Loading...

More Telugu News