Arunachal Pradesh: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా ఆగ్రహం.. గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్!

- దౌత్యపరమైన నిరసన చేపడతామని నిన్న చైనా ప్రకటన
- అరుణాచల్ వెళ్లేందుకు మాకు పూర్తి అధికారం ఉంది
- అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లోని అంతర్భాగం
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా మండిపడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిన్న మోదీ అక్కడకు వెళ్లగా... దీనిపై దౌత్యపరమైన నిరసన చేపడతామని చైనా ప్రకటించింది.
