google: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో ఇమేజ్‌ల విషయంలో మార్పులు!
- నిన్నటి వరకు విజిట్, వ్యూ, షేర్ ఆప్షన్‌లు
- ఇకపై విజిట్, షేర్ ఆప్షన్‌లు మాత్రమే
- వ్యూ ఇమేజ్ బటన్‌ను తొలగించేశామని గూగుల్ ప్రకటన
ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో ఏవైనా ఫొటోలను ఓపెన్ చేసినప్పుడు దాని పక్కనే విజిట్, వ్యూ, షేర్‌ల ఆప్షన్‌లు కనపడేవి. అయితే, వ్యూ ఆఫ్షన్‌ను ఇకపై చూడలేం. దానిని తొలగించినట్లు గూగుల్ తెలిపింది. దీంతో యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను ఇక ఇష్టం వచ్చినట్లు సేవ్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది.
కాపీ రైట్స్ కారణంగానే గూగుల్ ఈ ఆప్షన్‌ను తొలగించినట్టు తెలిసింది. తమ సెర్చింజన్‌లో కొన్ని మార్పులు చేశామని, వ్యూ ఇమేజ్ బటన్‌ను తొలగించేశామని గూగుల్ పేర్కొంది. యూజర్లకు, వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఇలా చేశామని తెలిపింది. ఇక ఇమేజ్‌లు ఫుల్ సైజులో చూడాలంటే ఆ ఇమేజ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా చూడాల్సిందే.