somireddy: ఢిల్లీలో జిందాబాద్ అనడం ..రాష్ట్రంలో నాటకాలాడటం!: జగన్ పై సోమిరెడ్డి విమర్శలు

  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి
  • జగన్ ప్రస్థానమంతా కేసులు, అరెస్టులు, వాయిదాలే
  • ఏపీకి ఇచ్చిన హామీల సాధన విషయంలో రాజీపడం

ఢిల్లీలో జిందాబాద్ అనడం, రాష్ట్రంలో నాటకాలాడటం వైసీపీ అధినేత జగన్ కు అలవాటైపోయిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ తన మీడియాలో కేంద్ర బడ్జెట్ ను మహాభారతంతో పోల్చారని, రాష్ట్రంలో నాటకాలాడుతూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రస్థానమంతా కేసులు, అరెస్టులు, వాయిదాలతో సరిపోతోందని, ఆయన ఆర్థిక నేరాలు, వాటి పరిణామాలపై పరిశోధన జరగాల్సి ఉందని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల సాధన విషయంలో మిత్రపక్షమైనా తాము రాజీపడే ప్రసక్తే లేదని సోమిరెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

somireddy
Telugudesam
  • Loading...

More Telugu News