RGV: నాపై వస్తోన్న అసత్య ఆరోపణలపై రేపు పోలీసులకు వివరిస్తా: వర్మ

  • 'జీఎస్టీ' గురించి మాట్లాడుతూ ఓ మహిళపై వర్మ అనుచిత వ్యాఖ్యలు
  • విచారణకు పిలిచిన పోలీసులు
  • రేపు విచారణకు హాజరవుతా: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ రేపు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కానున్న విషయం తెలిసిందే. వర్మ హాజరవుతారని పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఇటీవల వర్మ తన షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై మాట్లాడుతూ ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, తన మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో.. ఓ బాధ్యతగల పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తూ తాను రేపు విచారణకు హాజరు కానున్నానని రామ్ గోపాల్ వర్మ కూడా తాజాగా ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. తనపై వస్తోన్న అసత్య ఆరోపణలపై అధికారులకు వివరించి చెబుతానని చెప్పుకొచ్చారు.  

RGV
gst
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News