Indian Railways: రైల్లో తత్కాల్ ప్రయాణికుల నిబంధనల సడలింపు... షరతులతో ఫుల్ రిఫండ్ కూడా!

  • టికెట్ రద్దు చేసుకుంటే షరతులకు లోబడి పూర్తి రిఫండ్
  • రైలు మూడు గంటలు ఆలస్యమైతే పూర్తి చెల్లింపు
  • దారి మళ్లించినా కూడా రిఫండ్

భారతీయ రైల్వేల్లో ప్రయాణించాలని అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇది శుభవార్తే. టికెట్ ను రద్దు చేసుకుంటే, కొన్ని షరతులకు లోబడి తత్కాల్ టికెట్లపైనా పూర్తి రిఫండ్ ఇస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ-టికెట్లతో పాటు కౌంటర్ లో తీసుకున్న టికెట్లపైనా ఇది వర్తిస్తుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన షరతులను తెలుపుతూ, టికెట్ తీసుకున్న స్టేషన్ కు రైలు మూడు గంటలు అంతకుమించి ఆలస్యమైతే పూర్తి రిఫండ్ లభిస్తుందని తెలిపింది.

ఆ స్టేషన్ కు రాకుండా రైలును మరో దారిలో మళ్లించినప్పుడు తత్కాల్ టికెట్ పై పూర్తి రిఫండ్ లభిస్తుంది. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్ ను అధికారులు అనుసంధానించకున్నా కూడా రిఫండ్ లభిస్తుంది. ఏసీ క్లాసులో రిజర్వేషన్ చేయించుకుని, లోయర్ క్లాసులో టికెట్ కన్ఫర్మ్ అయి, ప్రయాణించడం ఇష్టం లేకున్నా కూడా పూర్తి రిఫండ్ లభిస్తుంది. ఒకవేళ లోయర్ క్లాసులో ప్రయాణించేందుకు అంగీకరించిన ప్రయాణికుడికి ఆ వ్యత్యాసాన్ని రైల్వే శాఖ వెనక్కు తిరిగి ఇచ్చేస్తుంది.

  • Loading...

More Telugu News