adi narayana reddy: ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం. . పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు : టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి వివరణ

  • ప్రజాస్వామ్య పద్ధతిలో నా సొంత అభిప్రాయం వ్యక్తం చేశాను
  • సీఎం గారు మాతో అన్న మాటలు కావు ఇవి
  • ఫలానా వ్యాఖ్యలు చెయ్యమని, చెయ్యొద్దని పార్టీ చెప్పదు
  • మరోమారు మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి ఆదినారాయణ

కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలు పరిష్కరించకుండా ఇలాగే వ్యవహరిస్తే వైసీపీ ఎంపీల కంటే ముందే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని, బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియా ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రానికి మార్చి 5 డెడ్ లైన్ విధిస్తున్నామని, ఈలోగా సమస్యలు పరిష్కరించకుంటే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చారు.

‘ఈ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం. పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. జగన్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. మా పరిస్థితిని బట్టి నా వ్యక్తిగతంగా లెక్కలేసుకుని చెప్పిన మాట. ఈ విధంగా చెబితే మాకు పట్టుదల ఉంటుంది!  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరగలేదు. ఈ బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ మార్చి 5న జరుగుతుంది కనుక, ఆ రోజున మా పార్టీ ఎంపీలు బయటకొస్తే బాగుంటుందని, కేంద్రం కూడా పరిశీలిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. నా వ్యక్తిగత అభిప్రాయం కిందే ఈ వ్యాఖ్యలు చేశాను. సీఎం గారు మాతో అన్న మాటలు కావు ఇవి. ఫలానా వ్యాఖ్యలు చెయ్యమని, చెయ్యొద్దని.. ఉపసంహరించుకోమని పార్టీ ఎప్పుడూ డైరెక్షన్ ఇవ్వదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేను వ్యక్తం చేసిన నా సొంత అభిప్రాయం ఇది’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News