adinarayana: మార్చి 5న మా ఎంపీల రాజీనామా!: ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • వైసీపీ ఎంపీల రాజీనామాకు ముందే మా ఎంపీల రాజీనామా
  • కేంద్ర ప్రభుత్వం 19 అంశాలను నెరవేర్చాల్సిందే
  • లేదంటే బీజేపీతో తెగదెంపులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన లోక్‌సభ సభ్యులతో రాజీనామా చేయించడానికి ముందే తమ ఎంపీలతో తాము రాజీనామా చేయిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి హామీ ఇచ్చిన 19 అంశాలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలు పరిష్కరించకుండా ఇలాగే వ్యవహరిస్తే మార్చి 5న రాజీనామాలు చేయిస్తామని తేల్చి చెప్పారు. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించారు. కాగా, ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన చేయకపోతే తమ లోక్‌సభ ఎంపీలతో జగన్ ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. 

adinarayana
YSRCP
Telugudesam
jagan
Union Budget 2018-19
  • Loading...

More Telugu News