diwakar reddy: దివాకర్ రెడ్డిపై మండిపడ్డ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

  • అక్రమాస్తులు, ట్రావెల్స్ కాపాడుకోవడానికే పార్టీ మారారు
  • హింసా రాజకీయాలకు ఆయన మారుపేరు
  • టీడీపీ నేతల బండారాన్ని బయటపెడతాం

బీజేపీపై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి మండిపడ్డారు. తన ఆస్తులను, అక్రమ ట్రావెల్స్ ను కాపాడుకోవడానికే దివాకర్ రెడ్డి పార్టీలు మారుతూ, డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనకు, హింసా రాజకీయాలకు దివాకర్ రెడ్డి మారుపేరని చెప్పారు. చంద్రబాబు మెప్పుకోసం దివాకర్ రెడ్డి నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలైన రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, జేసీ దివాకర్ రెడ్డిలు టీడీపీలో చేరి... తెలుగు రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల బండారాన్ని బయటపెడతామని చెప్పారు. మిత్రపక్షమైన బీజేపీపై అవాకులు, చెవాకులను పేలుతున్నారని... టీడీపీ నేతల విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

diwakar reddy
Telugudesam
BJP
suresh reddy
  • Loading...

More Telugu News