Telangana: తెలంగాణలోని ఏటీఎంలలో నగదు కొరత ఉందంటూ జైట్లీకి లేఖ రాసిన వినోద్

  • బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు కొరత
  • ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
  • తక్షణ చర్యలు చేపట్టాలని అరుణ్ జైట్లీకి వినోద్ వినతి

తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు కొరత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. నగదు కొరత కారణంగా ఉద్యోగులు, పింఛన్ దారులు, చిరు వ్యాపారులు తదితరులు ఇబ్బందిపడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీలోని ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు నిన్న అరుణ్ జైట్లీకి ఓ లేఖ రాశారు. ఏపీకి తక్షణం రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని అందులో కోరారు.

  • Loading...

More Telugu News