kollam: ఆడవారిలా తయారై లిప్ స్టిక్, పూలు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి అనుమతి!

  • ఆలయంలోకి పురుషులకు నో ఎంట్రీ
  • ఆడవారిలా తయారైతేనే ఎంట్రీ
  • కేరళలోని కొల్లాం జిల్లాలో విచిత్ర ఆలయం

ఆ దేవాలయంలోకి పురుషులకు అనుమతి లేదు. అయితే కొన్ని మినహాయింపులతో దైవాన్ని దర్శించుకోవచ్చు. తమ మొక్కులను చెల్లించుకోవచ్చు. దేవాలయంలోకి వెళ్లాలనుకున్న పురుషులు... అచ్చం మహిళల్లా చీర కట్టుకుని ముస్తాబు కావాలి. కంటికి కాటుక, పెదవులకు లిప్ స్టిక్, కురులలో పువ్వులు పెట్టుకోవాలి. స్త్రీల మాదిరి పురుషులు అలంకరించుకునేందుకు... ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ విచిత్రమైన ఆలయం కేరళలోని కొల్లాం జిల్లాలో ఉంది. ఈ దేవాలయం పేరు కొట్టాన్ కొల్లారా ఆలయం. చాలా కాలంగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది.

kollam
kottan kollara
  • Loading...

More Telugu News