Inhumane: నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని.. కర్రలతో కొట్టిన పోలీసులు

  • రోడ్డుపై నుంచి వెళ్లమని కేవలం భయపెట్టామని చెప్పుకొచ్చిన పోలీసులు
  • వీడియో తీసిన స్థానికులు
  • జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద ఘటన

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద నడిరోడ్డుపై అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కాదు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే. నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ స్మార్ట్ ఫోన్‌ల ద్వారా రికార్డు చేశారు.

నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తి ఉన్నాడని గుర్తించిన పెట్రోలింగ్ చేస్తోన్న పోలీసులు.. వాహనం దిగి ఈ ఘటనకు పాల్పడ్డారు. చివరకు అతడిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మీడియా ఆ పోలీసులను ప్రశ్నించగా... రోడ్డుపై నుంచి పక్కకు పంపడానికి తాము అతడిని భయపెట్టాలని మాత్రమే చూశామని చెప్పుకొచ్చారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News