moto z2 force: కిందపడితే పగలదు, నీరు పడితే చెదరదు...! మోటొ నుంచి జెడ్2 ఫోర్స్ స్మార్ట్ ఫోన్

  • అదిరిపోయే ఫీచర్లు
  • షట్టర్ షీల్డ్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్
  • 15 నిమిషాల్లోనే వేగంగా చార్జింగ్

లెనోవోకు చెందిన మోటొరోలా నుంచి జెడ్2 ఫోర్స్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు మార్కెట్లో విడుదలైంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ఇది షట్టర్ ప్రూఫ్ డిస్ ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ లో హై ఎండ్ చిప్ సెట్ 835 తో వస్తుంది. షట్టర్ షీల్డ్ డిస్ ప్లే అన్నది ఎటువంటి గీతలు పడకుండా, స్క్రీన్ బ్రేక్ అవకుండా రక్షణ కోసం ఏర్పాటు చేసినది. కింద పడి స్క్రీన్ పగిలినా, బ్రేక్ అయినా నాలుగేళ్ల పాటు గ్యారంటీ ఇస్తోంది మోటొరోలా. దీన్ని లిమిటెడ్ ఎడిషన్ గా మొటొరోలా విడుదల చేసింది. దీని ధర రూ.34,999. వన్ ప్లస్ 5టి, షియోమి ఎంఐ మిక్స్2, నోకియా 8లకు పోటీగా నిలవనుంది. టర్బో పవర్ ప్యాక్ మోటో మోడ్ తో కలసి బండిల్డ్ ఆఫర్ కింద రూ.34,999కే ఇది లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు:
డ్యుయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, 5.5 అంగుళాల క్యూహెచ్ డీ (1140, 2560 పిక్సల్స్) పోలెడ్ షట్టర్ షీల్డ్ డిస్ ప్లే, నీరు పడినా చుక్క కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, క్వాల్ కామ్ 835 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, 2టీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఆండ్రెనో 540 జీపీయూ, వెనుక భాగంలో 13 మెగా పిక్సల్స్ డ్యుయల్ కెమెరా (సోనీ సెన్సార్ తో), డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ముందు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2730 ఎంఏహెచ్ బ్యాటరీ, కేవలం 15 నిమిషాల్లో ఎనిమిది గంటలకు సరిపడా చార్జ్ చేసే టర్బో చార్జర్ తదితర సదుపాయాలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News