Chandrababu: ఏమిచ్చారో లెక్కలు తీసి చూపండి: బీజేపీ కి చంద్రబాబు సవాల్!

  • బడ్జెట్ తరువాత టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • మరింత వేడిని పెంచుతున్న చంద్రబాబు కామెంట్స్
  • బీజేపీయే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్

ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందుకు వచ్చిన తరువాత తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతుండగా, నేడు అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాటల వేడిని మరింత పెంచేలా ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందన్న విషయమై లెక్కలు తీసి చూపాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేంద్రం ఏం చేసిందనే అంశంపై బీజేపీయే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎంత మంజూరు చేశారో ఇప్పటివరకూ చెప్పనేలేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీజేపీ లెక్కలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు.

ఇక విభజన హామీల అమలుకు పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటంలో అర్థం ఉందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, రాష్ట్రానికి మేలు కలగాలన్న ఉద్దేశంతోనే పవన్ ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు. పవన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన జేఏసీతో టీడీపీకి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవని నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu
BJP
Telugudesam
budjet
Andhra Pradesh
  • Loading...

More Telugu News