Red Sandal: జైపూర్ లో సక్సెస్ అయిన కడప పోలీసుల సీక్రెట్ ఆపరేషన్!

  • ఎర్రచందనం నరికివేతపై కీలక ఆధారాలు సంపాదించిన కడప పోలీసులు
  • రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లి రహస్యంగా మకాం
  • గోడౌన్ ఆచూకీ తెలిసిన తరువాత దాడులు
  • ఇంటర్నేషనల్ స్మగ్లర్ అలీభాయ్ ప్రధాన అనుచరుడు అరెస్ట్

శేషాచలం అడవుల్లో సాగుతున్న ఎర్రచందనం చెట్ల నరికివేతలో కీలక ఆధారాలు సంపాదించిన కడప పోలీసులు, వాటి మూలాలు రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్నాయని తెలుసుకుని ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి విజయం సాధించారు. అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత వెనుక ఇంటర్నేషనల్ స్మగ్లర్ అశోక్ కుమార్ అగర్వాల్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు, అక్కడికి వెళ్లి మరిన్ని ఆధారాలు, దుంగలు దాచిన గోడౌన్ ప్రాంతాన్ని తెలుసుకునేదాకా ఆగి, ఆపై స్థానిక పోలీసుల సహకారంతో దాడులు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఆపై గోదాములపై దాడి చేసి రూ. 4 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇండోనేషియాకు చెందిన బడా స్మగ్లర్ అలీభాయ్ కి ఈ అశోక్ కుమార్ ప్రధాన అనుచరుడని వెల్లడించారు. తమ అదుపులో ఉన్న అశోక్ ను జైపూర్ కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై ఏపీకి తెచ్చి విచారిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.

Red Sandal
Rajasthan
Jaipur
Kadapa District
Police
  • Loading...

More Telugu News