chiranjeevi: 'సైరా' షూటింగుకు నయనతార వచ్చేస్తోంది!

  • ఈ నెల 23 నుంచి రెండవ షెడ్యూల్ 
  • చిరూ .. నయనతార కాంబినేషన్లో సీన్స్ 
  • అమితాబ్ .. విజయ్ సేతుపతి కూడా హాజరు

చిరంజీవి .. సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 'సైరా' సినిమా రూపొందుతోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి .. నయనతార కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఈ సీన్స్ వస్తాయని అంటున్నారు.

వచ్చే నెలాఖరు వరకూ జరగనున్న ఈ షెడ్యూల్లో అమితాబ్ .. విజయ్ సేతుపతి కూడా పాల్గొననున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ ను తీసుకున్నారు. కానీ ఆయన తప్పుకోవడంతో కొన్ని రోజులపాటు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఇళయరాజాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.    

  • Loading...

More Telugu News