Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న విధానం... ఏరియల్ వీడియో!

  • కొనసాగుతున్న స్పిల్ వే పనులు
  • ప్రతి సోమవారం సమీక్షిస్తున్న చంద్రబాబు
  • పనుల తీరును చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వరప్రదాయనిగా చెప్పుకునే ఈ జాతీయ ప్రాజెక్టులో ప్రస్తుతం డయాఫ్రమ్, స్పిల్ వే పనులు సాగుతున్నాయి. తొలుత 2018 నాటికి పనులు పూర్తయి, ప్రాజెక్టు జాతికి అంకితం అవుతుందని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా మరో ఒకటి రెండేళ్లు వేచి చూడక తప్పేలా లేదు.

 ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరును ప్రతి సోమవారం సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ కెమెరాలు ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తున్నాయి. తాజాగా తీసిన ఏరియల్ వ్యూ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Polavaram
Chandrababu
Arial View
Project
  • Error fetching data: Network response was not ok

More Telugu News