Andhra Pradesh: మాకు తెలుసు, ఏనాటికైనా వెన్నుపోటు పొడుస్తారని!: టీడీపీపై బీజేపీ నేత రఘురాం సంచలన విమర్శలు

  • టీడీపీకి వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య
  • దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
  • నాలుగేళ్ల పాటు కనిపించిన నిధులు ఇప్పుడు కనిపించడం లేదా?
  • టీవీ చానల్ డిస్కషన్ లో ఏపీ బీజేపీ సమన్వయకర్త రఘురాం

తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా బీజేపీకి వెన్ను పోటు పొడుస్తుందన్న విషయం తమకు తెలుసునని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కో ఆర్డినేటర్ రఘురాం సంచలన విమర్శలు చేశారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ డిస్కషన్ లో పాల్గొన్న ఆయన, వెన్నుపోటు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు అనుభవిస్తున్న కేంద్ర మంత్రి పదవులకు వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, వారికసలు సిగ్గేలేదని వ్యాఖ్యానించారు. ఏపీని బీజేపీ ఎంతగానో ఆదుకుందని, అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ల పాటు కనిపించిన బీజేపీ నిధులు, ఇప్పుడు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

పారిశ్రామికవేత్తలు ఎంపీలయితే, వారి వ్యక్తిగత ప్రయోజనాలే చూసుకుంటారని వ్యాఖ్యానించిన రఘురాం, వాజ్ పేయి దయతో ఒకసారి, మోదీ దయతో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ విషయాన్ని ఇప్పుడాయన మరచి పోయారని విమర్శించారు. నేడు బీజేపీని రాష్ట్రంలో లేకుండా చూడాలని ఆయన భావిస్తున్నారని, తమ పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం అవుతుంటే చూడలేకపోతున్నారని ఆరోపించారు. ఎంతగా విమర్శిస్తున్నా తాము సంయమనం పాటిస్తున్నామని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేసి, మిత్రబంధాన్ని తెంచుకునేందుకు తెలుగుదేశం చూస్తోందని ఆయన అన్నారు.

Andhra Pradesh
BJP
Raghuram
Chandrababu
  • Loading...

More Telugu News