Jacob Zuma: 9 ఏళ్ల కుంభకోణాల పాలనకు చరమగీతం.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రాజీనామా

  • అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ చేసిన సొంత పార్టీ
  • పెడచెవిన పెట్టడంతో అభిశంసన ద్వారా తొలగించేందుకు నిర్ణయం
  • దిగొచ్చిన జాకోబ్.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

దక్షిణాఫ్రికా అధ్యక్షుడి 9 ఏళ్ల కుంభకోణాల పాలనకు ఫుల్‌స్టాప్ పడింది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) ఆదేశాల మేరకు అధ్యక్షుడు జాకోబ్ జుమా (75) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జాతినుద్దేశించి జాకోబ్ మాట్లాడుతూ ఏఎన్‌సీ‌తో విభేదించారు. పార్టీ తనను బలవంతంగా బయటకు నెట్టివేసిందని ఆక్రోశించారు. అయితే పార్టీ ఆదేశాలను తాను పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను తక్షణం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

‘‘పార్టీ అధినాయకత్వంతో తాను విభేదిస్తున్నప్పటికీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఏఎన్‌సీ ఆదేశాలను పాటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది డిసెంబరులో డిప్యూటీ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాను పార్టీ నేతగా ప్రకటించిన ఏఎన్‌సీ మంగళవారం జాకోబ్‌ను తప్పుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే బుధవారం వరకు కూడా ఆయన రాజీనామా చేయకపోవడంతో అతడిపై పార్లమెంటులో ‘అపోజిషన్ మోషన్’ ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో దిగివచ్చిన జాకోబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Jacob Zuma
South Africa
President
  • Loading...

More Telugu News