sensex: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దెబ్బకు కుదేలైన మార్కెట్లు

  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ. 11 వేల కోట్ల కుంభకోణం
  • ప్రభుత్వ బ్యాంకులపై భారీ ఎఫెక్ట్
  • నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గత రెండు వారాలుగా నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు... ఈ వారంలో పుంజుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సఫలం కాలేకపోయాయి. ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ. 11వేల కోట్ల కుంభకోణం వార్త నేపథ్యంలో, ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 34,156కు పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు పతనమై 10,501 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్ (11.90%), రిలయన్స్ కమ్యూనికేషన్ (9.04%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.78%), గ్లాక్సో (7.38%), నాగార్జున కన్ స్ట్రక్షన్స్ (6.75%).    

టాప్ లూజర్స్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-9.81%), జేకే టైర్స్ (-7.88%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-7.87%), అలహాబాద్ బ్యాంక్ (-7.79%), ఓరియంటల్ బ్యాంక్ (-7.43%).

  • Loading...

More Telugu News