sailaja: నిజమే .. అప్పుడు మా దగ్గర 500లకి మించి లేవు: ఎస్.పి.శైలజ

  • అప్పుడు ఆయనకి అవకాశాలు లేవు 
  • నాకేమో డెలివరీ టైమ్ 
  • అందువలన ఆ పరిస్థితి వచ్చింది

తెలుగు తెరపై నటుడిగా శుభలేఖ సుధాకర్ కి .. గాయనిగా ఎస్.పి. శైలజకి మంచి గుర్తింపు వుంది. అన్యోన్య దంపతులుగా ఈ జంటకి పేరుంది. తాజాగా ఈ దంపతులు 'అలీతో సరదాగా' కార్యక్రమంలో, తమకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "ఒకానొక సమయంలో మీ బ్యాంకు బ్యాలెన్స్ 500 రూపాయలు మాత్రమే వుందని విన్నాను .. ఇది నిజమేనా ?" అని అలీ అడిగారు.

అందుకు శైలజ స్పందిస్తూ ..'నిజమే .. ఏ విషయమైనా మా ఇద్దరి మధ్యలోనే ఉండాలనీ.. పెద్దవాళ్లెవరికీ చెప్పకూడదని మేం అనుకున్నాం. సాధ్యమైనంతవరకూ సమస్యలను మేమే పరిష్కరించుకోవాలనుకున్నాం. డబ్బుకావాలని అత్తమామలను అడిగినా .. అన్నయ్యను అడిగినా మాకు ఇబ్బంది ఉండదు. కానీ అది మాకు ఇష్టం లేదు. ఆ సమయంలో ఆయనకి అవకాశాలు లేకపోవడం .. నా డెలివరీ టైమ్ కావడం జరిగింది. జీవితం ఇదేనని మనం అనుకుంటున్నప్పుడు .. మీరు ఫేస్ చేయవలసింది మరొకటి వుంది అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకు ఓ ఉదాహరణ ఇది. ఇంకో విషయం .. డబ్బుదేవుందండీ ఇవాళ వస్తుంది .. రేపు పోతుంది అని అందరూ కామన్ గా చెప్పుకుంటూ వుంటారు. ఇవాళ పోయిన డబ్బు .. రేపు కావాలంటే రాదు' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.     

sailaja
shubhalekha sudhakar
  • Loading...

More Telugu News