Jagan: జగన్ పాదయాత్రలో అగ్నిప్రమాదం.. జాగ్రత్తగా దాటించిన సెక్యూరిటీ, పోలీసులు

  • బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు
  • రోడ్డుపక్కనున్న పొదలు, ఎండుగడ్డికి మంటలు
  • దట్టంగా అలముకున్న పొగలు

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో చిన్నిపాటి అపశృతి దొర్లింది. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర తెల్లపాడు క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే... తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఆ బాణసంచా కాస్తా రోడ్డు పక్కనే ఉన్న పొదలు, ఎండుగడ్డిపై పడటంతో... అక్కడ మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలముకుంది.

 ఆ మంటలను దాటి ముందుకు సాగడానికి పాదయాత్రకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు జగన్ ను సురక్షితంగా మంటలు వ్యాపించిన ప్రదేశం నుంచి దాటించారు. అనంతరం వైసీసీ నేతలు మంటలను ఆర్పివేశారు.

Jagan
padayatra
Fire Accident
  • Loading...

More Telugu News