ramachandraiah: ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ కల్యాణ్ కమిటీ వేయాలి!: కాంగ్రెస్ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

  • అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలి
  • తమ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం
  • ఇప్పటికైనా చంద్రబాబు ప్రత్యేక హోదాపై పోరాడాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సాయంపై జనసేన అధినేత, సినీన‌టుడు పవన్ కల్యాణ్ సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. జేఎఫ్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాజకీయ కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు. పవన్ తీరును కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... లెక్కలపై పవన్ కమిటీ వేయడం కాకుండా ఏపీకి జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని అన్నారు.

అలాగే, అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలని రామచంద్రయ్య చెప్పారు. కాగా, ఏప్రిల్ ఆరున తమ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని వైఎస్ జగన్ ఈ రోజు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రత్యేక హోదాపై పోరాడాలని అన్నారు. 

ramachandraiah
Congress
BJP
Pawan Kalyan
Jagan
  • Loading...

More Telugu News