samsung: అమేజాన్ లో శామ్ సంగ్ 'హ్యాపీ అవర్స్' సేల్... పలు ఫోన్లపై తగ్గింపులు

  • గెలాక్సీ 8+, ఆన్7 ప్రైమ్, ఆన్5 ప్రో, ఆన్7ప్రోపై ఆఫర్లు
  • నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్, క్యాష్ బ్యాక్ లు కూడా
  • ఎయిర్ టెల్ కస్టమర్లకు రూ.1,500 క్యాష్ బ్యాక్

ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమేజాన్ ‘శామ్ సంగ్ హ్యాపీ అవర్స్ సేల్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ 8+ ను ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ తో ఎక్చేంజ్ చేసుకుంటే మరో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ సహా అన్ని ప్రముఖ క్రెడిట్ కార్డులపై వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం ఉంది.

గెలాక్సీ ఆన్ 7ప్రైమ్ ధర రూ.12,990 కాగా, బజాజ్ ఈఎంఐ కార్డు, ఇతర క్రెడిట్ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే రూ.1,000 తగ్గుతుంది. గెలాక్సీ ఆన్5ప్రో రూ.1,000, ఆన్ 7ప్రోపై రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దీంతో తగ్గింపు అనంతరం ఆన్ 5 ప్రోను రూ.6,990కు, ఆన్7ప్రోను రూ.7,490కు సొంతం చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ కస్టమర్లకు కూడా ఆఫర్లున్నాయి. గెలాక్సీ జే2, గెలాక్సీ జే7ప్రో, గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ పై రూ.1,500 వరకు ఎయిర్ టెల్ కస్టమర్లు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

samsung
amazon
happy hours sale
  • Loading...

More Telugu News