Chandrababu: వెలగపూడికి ముఖేష్ అంబానీ... రాష్ట్రంలో భారీ పెట్టుబడి!

  • నేడు విజయవాడకు రిలయన్స్ అధినేత
  • వెలగపూడి ఆర్టీజీ సెంటర్ పరిశీలన
  • ఆపై చంద్రబాబుతో చర్చలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలవనున్నారు. మరికాసేపట్లో విజయవాడకు రానున్న ఆయన, వెలగపూడికి చేరుకుని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ సెంటర్ ను పరిశీలించనున్నారు. ఆ తరువాత ముఖేష్, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలోని కేజీ బేసిన్ లో చమురు నిల్వలను వెలికితీస్తున్న ముఖేష్ అంబానీ, మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయంలో తనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుమతులపై చంద్రబాబుతో చర్చిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే పెట్రో కారిడార్ లో ముఖేష్ భారీ పెట్టుబడులు పెడతారని తెలుస్తోంది.

Chandrababu
Andhra Pradesh
Mukesh Ambani
Reliance
  • Loading...

More Telugu News