MAA: హీరోయిన్లు సహకరించడం లేదు... తోక కత్తిరిస్తాం: 'మా' అధ్యక్షుడు శివాజీరాజా సంచలన కామెంట్స్ వీడియో

  • కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు
  • బతిమాలినా 'మా' కార్యక్రమాలకు రావడం లేదు
  • నిర్దాక్షిణ్యంగా తోకలు కత్తిరిస్తాం
  • 'మా' అధ్యక్షుడు శివాజీ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు వచ్చి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు బతిమాలినా రావడం లేదని, తాము చేపట్టే ఏ మంచి పనికీ సహకరించడం లేదని 'మా' అధ్యక్షుడు శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము 'అమ్మా అమ్మా' అని బతిమాలుతుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే కోఆపరేట్ చేస్తున్నారని చెప్పిన ఆయన, వారి మేనేజర్లు కూడా అలాగే ఉన్నారని అన్నారు.

నిర్మాతలు ఇచ్చిన ఏవైనా చెక్కులు బౌన్స్ అయితేనే సభ్యత్వం కోసం తమ వద్దకు పరిగెత్తుకుని వస్తున్నారని ఆయన ఆరోపించారు. హీరోయిన్లు తోకలు జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని హెచ్చరించారు. మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, తాము కూడా ఎంతో కొంత ఇస్తామని 'మా' కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. శివాజీ వ్యాఖ్యలకు నటుడు నరేష్ కూడా మద్దతు తెలిపారు. హీరోయిన్లు తప్పనిసరిగా 'మా' సభ్యత్వం తీసుకోవాల్సిందేనని, వారంతా టాలీవుడ్ కార్యక్రమాల్లో పాల్గొనకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు.

MAA
Movie Artists Association
Sivaji
Naresh
  • Error fetching data: Network response was not ok

More Telugu News