Rahul Gandhi: కర్ణాటకలోని చిన్ని టీ స్టాల్ లో పకోడీ తిని, టీ తాగిన రాహుల్ గాంధీ.. అమిత్ షాకు కౌంటర్!

  • పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనన్న అమిత్ షా
  • కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ
  • రోడ్డు పక్కన నేతలతో కలసి పకోడీ ఆరగింపు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఊహించని విధంగా ఇలా చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనంటూ పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతూ, నిరుద్యోగం అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి సమాధానంగా అమిత్ షా పకోడీ రిప్లై ఇచ్చారు. అనంతరం దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయింది. అమిత్ షాకు కౌంటర్ ఇచ్చేందుకే రాహుల్ ఈరోజు పకోడీ తిన్నారు. 

Rahul Gandhi
amith shah
pakodi
siddaramaiah
Karnataka
election campaign
  • Loading...

More Telugu News