Aishwarya Rai: డబ్బు కోసం భర్తతో కలసి నటించే అవకాశాన్ని వదులుకున్న ఐశ్వర్యారాయ్

  • భర్తతో కలసి నటించే అవకాశాన్ని వదులుకున్న ఐశ్వర్య
  • 10 కోట్లు తీసుకుని వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్
  • ఐశ్వర్యకు డబ్బు పిచ్చి పట్టిందంటున్న బాలీవుడ్ జనాలు

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ కి డబ్బు పిచ్చి పట్టిందా? ఔననే అంటున్నారు బాలీవుడ్ జనాలు. వివరాల్లోకి వెళ్తే, తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలసి నటించే అవకాశం ఇటీవల ఐశ్వర్యకు వచ్చిందట. కథను విన్న వెంటనే ఆ సినిమాలో నటించేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెప్పారట. అయితే, కథలో చిన్నపాటి మార్పులు చేయాలంటూ ఐశ్వర్య సూచించిందట. ఐష్ కోరిన విధంగానే సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి తీసుకెళ్లాడట. అయితే, ఇప్పుడు ఈ సినిమా చేయలేనని, మరో సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకున్నానని ఐష్ చెప్పిందట. కథ మారిస్తే తన సినిమా చేస్తానని చెప్పారు కదా అని దర్శకుడు అడిగితే... పది కోట్లు ఇస్తుంటే సినిమాను ఎలా వదులుకుంటానని రిప్లై ఇచ్చిందట. ఈ సినిమా పూర్తయిన తర్వాత మీ సినిమా చేస్తానని చెప్పిందట. ఈమె సినిమా పూర్తయిన తర్వాత అభిషేక్ డేట్లు కుదరాలి కదా అంటూ బీటౌన్ జనాలు ఇప్పుడు గుసగుసలు పోతున్నారు. భర్తతో కలసి నటించే అవకాశం లేకలేక వస్తే... డబ్బు కోసం ఆ అవకాశాన్ని వదిలేసుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Aishwarya Rai
abhishek bachchan
bollywood
movie chance
  • Loading...

More Telugu News