vehicle sales: జనవరిలో రికార్డు స్థాయిలో కార్లు, ద్విచక్ర వాహన విక్రయాలు
- ప్రయాణికుల వాహనాల్లో వృద్ధి 7.57 శాతం
- వాణిజ్య వాహనాలు, మోటారు సైకిళ్ల అమ్మకాలు అధికం
- 33 శాతానికి పైగా వృద్ధి
దేశీయంగా వాహన రంగానికి ఈ జనవరి కలిసొచ్చింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ విడుదల చేసిన గణాంకాలను గమనిస్తే... ప్రయాణికుల వాహనాలు (కార్లు, జీపు, వ్యాన్లు) జనవరిలో 2,85,477 అమ్ముడుపోయాయి. 2017జనవరిలో అమ్మకాలతో చూస్తే 7.57 శాతం ఎక్కువ. వాణిజ్య వాహనాలు 85,660 అమ్ముడయ్యాయి. ఇది 39.73 శాతం అధికం.
అలాగే, ద్విచక్ర వాహనాలు సైతం 16,84,066 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 33.43 శాతం అధికం. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లో స్కూటర్లు 48.29 శాతం వృద్ధితో 5,53,695 విక్రయమయ్యాయి. మోటారు సైకిళ్లు 28.64 శాతం వృద్ధితో 10,54,062 అమ్ముడు పోయాయి. మొత్తం మీద పరిశ్రమ వారీగా చూస్తే వాహన విక్రయాలు 30 శాతం వృద్ధితో 21,17,746 యూనిట్లుగా నమోదయ్యాయి.