Jallikattu: తమిళనాట జల్లికట్టులో 'బసవన్న కొంబస్' వీరమరణం... ఘనంగా అంత్యక్రియలు!

  • రంకెలు వేస్తూ వచ్చి కుప్పకూలిన వృషభరాజం కొంబస్
  • కొమ్ములు సిమెంట్ దిమ్మెను తాకడంతో ప్రమాదం
  • తమిళ మంత్రి విజయ భాస్కర్ ప్రేమగా పెంచుకునే కొంబస్

తమిళనాట జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంకెలు వేస్తూ, పరిగెత్తుతూ వచ్చిన ఆంబోతు ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న వృషభరాజం అది. దాని పేరు కొంబస్. బరి నుంచి వదలగానే పరుగున వస్తున్న ఆ ఎద్దు కొమ్ము సిమెంట్ దిమ్మెకు బలంగా తాకింది. ఆ క్షణంలోనే దాని కొమ్ము విరిగి, మెదడు బద్ధలైంది. అక్కడికక్కడే కిందపడిపోయిన ఆ ఎద్దు మరిక లేవలేదు. ఆ ఎద్దును కాపాడాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జల్లికట్టులో వీరమరణం పొందిన కొంబస్ అంత్యక్రియలు ఘనంగా జరుగగా, వేలాది మంది పాల్గొన్నారు.

Jallikattu
Kombus
Ox
Died
  • Loading...

More Telugu News